ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ
ఢిల్లీ, 2 డిసెంబర్ (హి.స.)ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ''మోంథా'' తుపాను సృష్టించిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి, సహాయం కోరడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారు కేంద్ర హోంమంత్రి అమ
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ


ఢిల్లీ, 2 డిసెంబర్ (హి.స.)ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో 'మోంథా' తుపాను సృష్టించిన నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి, సహాయం కోరడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో సమావేశం కానున్నారు.

మంగళవారం పార్లమెంటుకు చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేశ్, హోంమంత్రి అనితలకు టీడీపీ ఎంపీలు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్లమెంటులోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో తమ పార్టీ ఎంపీలతో మంత్రులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

ఈ భేటీల అనంతరం మంత్రులు లోకేశ్, అనిత కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మోంథా తుపాను కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టంపై రూపొందించిన సమగ్ర నివేదికను వారికి అందజేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande