రాష్ట్రంలో మరో భారీ అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం
అనకాపల్లి, 2 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన అనకాపల్లి (Anakapally) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే.. నర్సీపట్నం (Narsipatnam) పట్టణ కేంద్రంలోని శారదానగర్ పోస్టాఫీసు ఎదురుగా ఉన్న భవనంలో అకస
Fire


అనకాపల్లి, 2 డిసెంబర్ (హి.స.) రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఘటన అనకాపల్లి (Anakapally) జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే.. నర్సీపట్నం (Narsipatnam) పట్టణ కేంద్రంలోని శారదానగర్ పోస్టాఫీసు ఎదురుగా ఉన్న భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు తక్షణమే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం వారు ఫైర్ ఇంజన్‌తో స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మొదట ఒక అంతస్తులో మంటలు చెలరేగగా.. కాసేపటికి అవి భవనం మొత్తానికి వ్యాపించాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదానికి విద్యుత్ షాక్ సర్క్యూట్ (Shock Circuit) కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande