
అమరావతి, 2 డిసెంబర్ (హి.స.)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలినట్టు ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని పలువురు నాయకుడు డిమాండ్ చేయగా తాజాగా మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. లేదంటే భవిష్యత్‌లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని చెప్పారు. పవన్ తలతిక్క మాటలు మానుకోవాలన్నారు. తెలంగాణలో వనరులు వాడుకుని ఈ స్థాయికి ఎదిగాడని మైలేజ్ పొందాలంటే పనితనం చూపించాలని హితవుపలికారు. పవన్ కల్యాణ్ వి మెచ్యురిటీ లేని మాటలు అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు రాకపోవడం వల్లనే విడిపోయామని చెప్పారు. ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చూసి అలా మాట్లాడటం సరికాదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV