భారత రాష్ట్రపతి.ద్రౌపది.ముర్ము ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్
భారత రాష్ట్రపతి.ద్రౌపది.ముర్ము ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్


అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)

హైదరాబాద్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ద్రౌపది ముర్ము నిన్ననే నగరానికి రాగా.. ఈరోజు(శనివారం) సీపీ రాధాకృష్ణన్ చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్న సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకోగా.. మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఘనస్వాగతం పలికారు. నేడు జరిగే పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల ముగింపు సదస్సులో ఉప రాష్ట్రపతి పాల్గొనున్నారు. మరోవైపు శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి.. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిన్న జరిగిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈరోజు గచ్చిబౌలిలో బ్రహ్మ కుమారిస్ శాంతి సర్వోవర్‌ను ఆమె సందర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande