
అనంతపురం, 21 డిసెంబర్ (హి.స.)
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వసతిగృహంలో ఉంటూ ఎంఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కట్టెపు మాధుర్య అనారోగ్యంతో చనిపోయింది. ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురికాగా అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ యువతి చనిపోయినట్లు డాక్టర్ నిర్ధరించారు. ఏ కారణం వల్ల ఆమె చనిపోయిందో స్పష్టత లేదు. యువతి వాడుతున్న చర్మ వ్యాధి మాత్రల ఓవర్ డోస్‌తోనే గుండెనొప్పి వచ్చి ఉంటుందని, లేదా ఫిట్స్ వలన చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ