ఓటమి చెందిన నాయకులు నిరాశ చెందవద్దు.. భూపాలపల్లి ఎమ్మెల్యే
హనుమకొండ, 21 డిసెంబర్ (హి.స.) గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ లు ఐక్యంగా పని చేసి, ప్రజల సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయం సాధించిన మండలంలోన
భూపాలపల్లి ఎమ్మెల్యే


హనుమకొండ, 21 డిసెంబర్ (హి.స.)

గ్రామాల అభివృద్ధికి సర్పంచ్ లు

ఐక్యంగా పని చేసి, ప్రజల సమస్యలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయం సాధించిన మండలంలోని గట్లకానిపర్తి, సాధనపల్లి, శాయంపేట గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు హన్మకొండ లోని ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధనకు ప్రజల సమస్యలు సర్పంచ్ లు వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటమి చెందిన నాయకులు నిరుత్సాహ పడకుండా, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande