గాంధీ మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు.. ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేట, 21 డిసెంబర్ (హి.స.) గాంధీ మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు.. గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పని చేయలేదని మెదక్ ఎంపీ రఘుందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉ
రఘునందన్ రావు


సిద్దిపేట, 21 డిసెంబర్ (హి.స.)

గాంధీ మీద కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు.. గాంధీ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పని చేయలేదని మెదక్ ఎంపీ రఘుందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లను ఆత్మీయ సన్మాన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కోరుకున్న విధంగా దేశంలో రామ రాజ్యపాలన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాగిస్తుందన్నారు. గాంధీ పేరు లేకుంటే కాంగ్రెస్ పార్టీని ఎవరూ దేకరనే బాధలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు. 100 రోజులు ఉన్న పథకంను 120 రోజులకు పొడిగిస్తే కాంగ్రెస్ నాయకులకు ఏం ఇబ్బంది అవుతుందని సూటిగా ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande