PV ఎక్స్ప్రెస్ వేపై ఢీకొన్న మూడు కార్లు.. 6 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) నగరంలో 6 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయిన ఘటన పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఫై ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వైపు వెళ్తుండగా.. పీవీ ఎక్స్
ఎక్స్ప్రెస్ వే ఫై కార్లు డీ


హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)

నగరంలో 6 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయిన ఘటన పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఫై ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వైపు వెళ్తుండగా.. పీవీ ఎక్స్ప్రెస్ వేపై పిల్లర్ నెంబర్ 253 వద్ద పొగమంచు కారణంగా మూడు కార్లు ఒకదాని వెనుక మరొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో మూడు కార్లు రోడ్డుకు అడ్డంగా పడిపోగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆ రూట్లో రెండు వైపులా సుమారు 6 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారుల సమాచారం మేరకు రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande