
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) ఉపాధిహామీ పథకం పేరు మార్పుపై
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నరేగా పథకం ద్వారా ప్రజలకు మరిన్ని లాభాలు చేకూరేలా కేంద్రం మార్పులు చేసిందని చెప్పారు. పథకం పేరు మాత్రమే మార్చారని దాని వల్ల కాంగ్రెస్ నాయకులకు వచ్చిన నష్టం ఏంటో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి నరేగాపై మాట్లాడే అధికారం కూడా లేదని విమర్శించారు.
మన్మోహన్ సింగ్ పదవీకాలం పూర్తయ్యేవరకు ఈ పథకం ద్వారా కేవలం లక్షకోట్లు మాత్రమే దేశంలో ఖర్చు చేశారన్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తరవాత ఎనిమిది లక్షల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు చేశామని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..