
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి
1991 వరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు భారత ఆర్థిక సామర్థ్యాన్ని, సంస్కృతిని చిన్నచూపు చూశాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. ముంబైలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఆ కాలంలో దేశ వృద్ధి రేటు కేవలం 4 నుంచి 4.5 శాతానికే పరిమితం కావడాన్ని 'హిందూ రేట్ ఆఫ్ గ్రోత్'గా పిలిచేవారని, భారత్ ఇంతకంటే ఎదగలేదు అనే బలమైన అపోహను ప్రజల్లో కలిగించారని ఆయన మండిపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల హక్కులను కాంగ్రెస్ హరించివేసిందని, తర్వాత వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు కొంత కాలం పోరాడినా, ఎక్కువ కాలం కాంగ్రెస్ నీడలోనే పాలన సాగిందని ఆయన గుర్తు చేశారు.
గతంలో ప్రభుత్వాలు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకునేవని, కేవలం తమకు నచ్చిన కొంతమంది మిత్రులకు మాత్రమే అండగా నిలుస్తూ సామాన్యులను పట్టించుకోలేదని గోయల్ ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు