
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
నగరం నడిబొడ్డున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం వడ్డేర బస్తీలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ఈ క్రమంలోనే మొదటి అంతస్తులో చిక్కుకుపోయిన ఏడుగురిని పోలీసులు చాకచక్యంగా రక్షించారు. గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..