
నాగర్ కర్నూల్, 20 డిసెంబర్ (హి.స.)
శనివారం కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న జ్ఞానేష్ కుమార్, శ్రీశైలం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూరులోని తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్లో కాసేపు విరామం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని సహజ అటవీ సంపద పై స్థానిక అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో పాటు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర పాల్గొన్నారు. నల్లమల్ల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న వన్యప్రాణులు, అడవుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు, జీవ వైవిధ్య పరిరక్షణ కార్యక్రమాలు, అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలపై అధికారులు జాతీయ ఎన్నికల ప్రధాన అధికారికి వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు