
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేసింది. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ నేపథ్యంలో, అమెరికాను వీడి బయటకు ప్రయాణించవద్దని స్పష్టమైన అడ్వైజరీ ఇచ్చింది. కొత్త విధానాల కారణంగా వీసా అపాయింట్మెంట్లు భారీగా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే 2026 అక్టోబర్ నెలాఖరు వరకు అపాయింట్మెంట్లు లభించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి బయటకు వెళ్తే తిరిగి రావడానికి వీసా ప్రాసెస్ పూర్తవ్వడానికి నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చే ప్రమాదం ఉందని గూగుల్ హెచ్చరించింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..