
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) తెలంగాణ బీజేపీలో సినీ గ్లామర్ మరోసారి చర్చగా మారింది. తాజాగా ఆ పార్టీలో నాటి స్టార్ హీరోయిన్ ఆమని చేరారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ సభ్యత్వం అందజేశారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు