
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)
పాతబస్తీకే మణిహారంగా బమ్ -రుర్న్-ఉద్-దౌలా చెరువును హైడ్రా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. జనవరిలో ఈ చెరువును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం బమ్-రుర్న్-ఉద్-దౌలా చెరువు అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
కాలగర్భంలో కలిసిపోయిందనుకున్న చరిత్రకు ప్రాణం పోస్తున్నాం... ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా అక్కడ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను ఆదేశించారు. చెరువుకు స్థానికులు సులభంగా చేరుకునేలా రహదారులతో పాటు ప్రవేశ ద్వారాలుండాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..