పాడే మోసి కన్నీటి వీడ్కోలు తెలిపిన మంత్రి పొంగులేటి.
ఖమ్మం, 20 డిసెంబర్ (హి.స.) కాంగ్రెస్ నాయకుడు యడవల్లి రామిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అంత్యక్రియల సందర్భంగా మంత్రి పొంగులేటి తన ప్రోటోకాల్ను పక్కన పెట్టారు. తన ప్రియతమ అనుచరుడికి కడసారి వీడ్కోలు పలుకుత
మంత్రి పొంగులేటి.


ఖమ్మం, 20 డిసెంబర్ (హి.స.)

కాంగ్రెస్ నాయకుడు యడవల్లి రామిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

అంత్యక్రియల సందర్భంగా మంత్రి పొంగులేటి తన ప్రోటోకాల్ను పక్కన పెట్టారు. తన ప్రియతమ అనుచరుడికి కడసారి వీడ్కోలు పలుకుతూ మంత్రి స్వయంగా పాడే మోశారు. సాధారణ కార్యకర్తలు, ఇతర నాయకులతో కలిసి శ్మశాన వాటిక వరకు నడిచి తనపై ఉన్న అపారమైన గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉండి కూడా, తన అనుచరుడి కోసం పాడే పట్టి.. కన్నీటి వీడ్కోలు పలకడాన్ని చూసి పాలేరు ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande