హుజూరాబాద్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్
హుజురాబాద్,20 డిసెంబర్ (హి.స.) నాకు రాజకీయ జన్మనిచ్చి, నేడు శాసనమండలి సభ్యునిగా ఈ స్థాయిలో నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్
ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్


హుజురాబాద్,20 డిసెంబర్ (హి.స.)

నాకు రాజకీయ జన్మనిచ్చి, నేడు శాసనమండలి సభ్యునిగా ఈ స్థాయిలో నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మూరి వెంకట్ అన్నారు. శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ మద్దతుదారులైన నూతన సర్పంచులను ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందని వెంకట్ పేర్కొన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నాయని కాంగ్రెస్ అభ్యర్థులను ఎలాగైనా ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ వైపు నిలిచారని సుమారు 30కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande