
మేడ్చల్ మల్కాజిగిరి, 20 డిసెంబర్ (హి.స.)
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి
చెందటమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మేడ్చల్ నియోజకవర్గం ఘట్ కేసర్ లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ వస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఘట్కేసర్ లో రహదారులు, వంతెన అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు