ఉత్తరాదిని కమ్మేసిన దట్టమైన పొగమంచు: ఢిల్లీకి 'రెడ్ అలర్ట్'..
న్యూఢిల్లీ, 20 డిసెంబర్ (హి.స.) ఉత్తర భారతదేశాన్ని దట్టమైన పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విజిబిలిటీ (కనిపించే దూరం) కొన్ని చోట్ల సున్నాకి పడిపోయింది. ఈ తీవ్ర పరిస్థితుల
రెడ్ అలర్ట్'..


న్యూఢిల్లీ, 20 డిసెంబర్ (హి.స.)

ఉత్తర భారతదేశాన్ని దట్టమైన

పొగమంచు దుప్పటిలా కప్పేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో విజిబిలిటీ (కనిపించే దూరం) కొన్ని చోట్ల సున్నాకి పడిపోయింది. ఈ తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. పొగమంచు ప్రభావంతో దేశ రాజధానిలో 150కి పైగా విమాన సర్వీసులు రద్దు కాగా, వందలాది రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు కనీసం 50 మీటర్ల దూరాన్ని కూడా చూడలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి.

కేవలం పొగమంచే కాకుండా, ఢిల్లీలో వాయు కాలుష్యం (AQI) కూడా 'తీవ్ర' స్థాయికి చేరుకోవడంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande