రోడ్డు ఎక్కిన ఆసిఫాబాద్ కేజీబీవీ విద్యార్థులు..
ఆసిఫాబాద్, 20 డిసెంబర్ (హి.స.) ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. ప్రిన్సిపల్ మేడం తమను అనుచిత వ్యాఖ్యలతో తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు శనివారం తరగతులను బహిష్కరించి రో
ఆసిఫాబాద్ స్కూల్


ఆసిఫాబాద్, 20 డిసెంబర్ (హి.స.) ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఉద్రిక్తత నెలకొంది. ప్రిన్సిపల్ మేడం తమను అనుచిత వ్యాఖ్యలతో తీవ్ర మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థినులు శనివారం తరగతులను బహిష్కరించి రోడ్డు ఎక్కారు. తల్లిదండ్రులతో కలిసి మూకుమ్మడిగా వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ ప్రిన్సిపాల్ మేడం మాకొద్దు.. కలెక్టర్ రావాలే మాకు న్యాయం చేయాలే అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande