సౌదీ బస్సు ప్రమాదం.. పరిహారం విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.) సౌదీ అరేబియా లో నవంబర్ 17 న జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్ లోని పలు కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది సజీవ దహనం కాగా హైదరాబాద్ లోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన నజీరుద్ద
సౌదీ బస్సు ప్రమాదం


హైదరాబాద్, 20 డిసెంబర్ (హి.స.)

సౌదీ అరేబియా లో నవంబర్ 17 న జరిగిన ఘోర ప్రమాదం హైదరాబాద్ లోని పలు కుటుంబాల్లో అంతులేని విషాదం మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మొత్తం 45 మంది సజీవ దహనం కాగా హైదరాబాద్ లోని విద్యానగర్ ప్రాంతానికి చెందిన నజీరుద్దీన్ కుటుంబంలోని రెండేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులంతా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3.07 మంజూరు చేశారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి జీవో నం.125 ద్వారా నిధుల మంజూరుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, ఈ మొత్తాన్ని తెలంగాణ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఖాతా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫతే మైదాన్ బ్రాంచ్లో జమ చేయాలని సీఎంవో అధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande