
వనపర్తి, 20 డిసెంబర్ (హి.స.)
వనపర్తి జిల్లాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ డిసెంబర్ 23న పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో గవర్నర్ పర్యటనకు సంబంధించి అదనపు కలెక్టర్ పలు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. సుమారు 3.30 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని.. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. ప్రోటోకాల్, బందో బస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టమ్, కరెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు