మాకు ఏపీనే స్ఫూర్తి: విశాఖ పర్యటనలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
అమరావతి, 20 డిసెంబర్ (హి.స.) ఏపీ(Ap) అభివృద్ధిని చూశాక తెలంగాణ(Telangana) ప్రజల్లో ఆలోచన మొదలైందని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్(Visakhapatnam Park Hotel Circle) వద్ద వాజ్ పేయి కాంస్య విగ్
బండి సంజయ్


అమరావతి, 20 డిసెంబర్ (హి.స.)

ఏపీ(Ap) అభివృద్ధిని చూశాక తెలంగాణ(Telangana) ప్రజల్లో ఆలోచన మొదలైందని కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. విశాఖ పార్క్ హోటల్ సర్కిల్(Visakhapatnam Park Hotel Circle) వద్ద వాజ్ పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కార్ సహకరిస్తుందని తెలిపారు. వైజాగ్‌కు వస్తే బీపీ, షుగర్ ఎగిరిపోతాయని చెప్పారు. సముద్రమంతా విశాల హృదయం వైజాగ్ వాసుల సొంతమన్నారు. ప్రేమకు తీరం, పోరాటానికి పునాది వైజాగ్ అని పేర్కొన్నారు. అందాలకే కాదని…. పోరాటాలకు విశాఖ ప్రసిద్ధి చెందిందని తెలిపారు. నేవీకి బలమని…పరిశ్రమలకు ద్వారమని, విద్యకు కేంద్రమని, స్కృతికి నిలయమని విశాఖ నగరం అని కొనియాడారు.

విశాఖ అభివృద్ధి చెందితే దేశమంతా ఫలాలు అందుతాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఏపీకి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయన్నారు. అవినీతి కాంగ్రెస్ విషవృక్షాన్ని సముద్రంలో విసిరేసిన ఏపీకి హ్యాట్సాఫ్ అని బండిసంజయ్ చెప్పారు. తెలంగాణ బీజేపీకి ఏపీనే స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్‌ను స్థాపిస్తామని బండి సంజయ్ దీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande