ఇందిరమ్మ.ఇళ్లు.నిర్మాణంలో ఆటుపోట్లు
పెద్దపల్లి, 21 డిసెంబర్ (హి.స.) : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. ఏడాది సమీపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించడం లేదు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సాంకేతిక విధానాన్ని అమలు చేయడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడ
ఇందిరమ్మ.ఇళ్లు.నిర్మాణంలో ఆటుపోట్లు


పెద్దపల్లి, 21 డిసెంబర్ (హి.స.)

: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. ఏడాది సమీపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించడం లేదు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సాంకేతిక విధానాన్ని అమలు చేయడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. పాత ఇంటికే బిల్లులు పొందాలని ఆశించిన లబ్ధిదారులకు నిరాశ కలిగింది. దీంతో చాలా మంది ఇళ్లను రద్దు చేసుకుంటున్నారు.

జిల్లాలో రెండు విడతల్లో 9,400 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 6,600 ఇళ్లకు కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో తొలి, మే నెలలో రెండో విడత ఇళ్లు మంజూరు చేశారు. పదకొండు నెలలుగా లబ్ధిదారుల ఇళ్లకు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పలు కారణాలతో నిర్మించుకోవడానికి దాటవేస్తూ వస్తున్నారు. ఇల్లు నిర్మిస్తేనే బిల్లులు వస్తాయని భావించిన కొందరు రద్దు చేసుకుంటున్నారు. ఇల్లు మంజూరు పత్రం ఇచ్చిన 45 రోజుల్లోపు పనులు ప్రారంభించుకోవాలి. నెలల గడుస్తున్నా ముందుకురాని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. జిల్లాలో 1,400 మంది రద్దు కోసం అంగీకార పత్రాలు ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande