
గుంటూరు, 21 డిసెంబర్ (హి.స.):క్వాంటం టెక్నాలజీకి పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దశల వారీగా లక్ష్యాలను సీఎం చంద్రబాబు నిర్దేశించారు. పునాది, విస్తరణ, నాయకత్వ దశల లక్ష్యాలను తాజాగా విడుదల చేశారు. రాబోయే సంవత్సరం 2026 మొత్తం పునాది దశగా పరిగణిస్తారు. 2027, 2028, 2029 విస్తరణ దశ, 2030 నుంచి నాయకత్వ దశగా నిర్ణయించారు. వీటికి వేర్వేరుగా లక్ష్యాలను నిర్ణయించారు. ప్రస్తుత పునాది దశలో స్టార్టప్ పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. క్యూపీఏఐ, నోస్ట్రాడమస్ టెక్నాలజీస్, 42 టెక్నాలజీ, క్యూబిటెక్ స్మార్ట్ సొల్యూషన్స్, సైబ్రానెక్స్ టెక్నాలజీస్, సెంటెల్లా సైంటిఫిక్, క్యూక్లెయిర్‌వోయన్స్ క్వాంటం ల్యాబ్స్ పెట్టుబడులకు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ