కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది: పినపాక ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం, 21 డిసెంబర్ (హి.స.) కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని మనోభావాలు దెబ్బతీసేలా చర్యలు చేపడుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఆదివారం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును బాపూజీ రాంజీగ
పినపాక ఎమ్మెల్యే


భద్రాద్రి కొత్తగూడెం, 21 డిసెంబర్ (హి.స.)

కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని మనోభావాలు దెబ్బతీసేలా చర్యలు చేపడుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఆదివారం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును బాపూజీ రాంజీగా మార్చడాన్ని నిరసిస్తూ దానికి క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేేే మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మనోభావాలు దెబ్బతీసేలా ముందుకు పోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేయడం చేత కావడం లేదన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఆయన పేరును తొలగించి దుర్మార్గంగా నీచమైన చర్యలకు పాల్పడుతుందన్నారు. బాపూజీ రాంజీ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande