
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
జాతీయ ఉపాధి హామీ పథకం
స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (వీబీ-జీ రామ్ జీ) బిల్లు తీసుకురావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పేదరికం, ఆత్మహత్యలను తగ్గించడంలో సహాయపడిన పథకాన్ని కేంద్రం బలహీన పరుస్తోందని దుయ్యబట్టారు. ఆదివారం ఓ న్యూస్ ఎజెన్సీతో మాట్లాడిన ఆయన.. నరేగా స్థానంలో వీబీ-జీ రామ్ జీ పథకం ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రం పేదలకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తిని నీరుగార్చిందని మహాత్మా గాంధీ పేరును తొలగించి ఆర్థిక భారాన్ని రాష్ట్రాలపై మోపుతోందని ఆరోపించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు