
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
సోనియా గాంధీ వల్లనే తెలంగాణ
ప్రజలు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్రైస్తవ సమాజాన్ని అవమానించుడే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. భారతదేశం చాలా ఉదారవాద దేశం అని చెప్పారు. దేశంలో ఎంతో మంది శరణార్థులు ఉన్నారని అన్నారు. భారత్ సెక్యులర్ కంట్రీ అని స్పష్టం చేశారు. కొన్ని వందల ఏళ్లుగా ఇక్కడ అన్ని మతాలవారు నివసిస్తున్నారని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు