ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పులుల దుర్మరణం..
కొమురం భీం ఆసిఫాబాద్, 21 డిసెంబర్ (హి.స.) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దులోని యావత్ మాల్ జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు పులులు మృత్యువాత పడ్డాయి. వనీ-గుగ్గూస్ మార్గంలోని బెలోర ఫాటా వద్ద రోడ్డు పక్కనే ఓ పెద్ద పులి
పులుల మరణం


కొమురం భీం ఆసిఫాబాద్, 21 డిసెంబర్ (హి.స.)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దులోని యావత్ మాల్ జిల్లాలో వేర్వేరు చోట్ల రెండు పులులు మృత్యువాత పడ్డాయి. వనీ-గుగ్గూస్ మార్గంలోని బెలోర ఫాటా వద్ద రోడ్డు పక్కనే ఓ పెద్ద పులి కళేబరాన్ని ఆదివారం ఉదయం గుర్తించారు. ఇదే ప్రాంతంలోని నయా గావ్ అటవీలో రెండు కిలోమీటర్ల దూరంలోని వార్ధా నది ఒడ్డున రోడ్డు పై మరో పులి కళేబరాన్ని వాహనాలు స్థానికులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులుల మృతదేహాలను క్షుణ్ణంగా పరిశీలించి పులి రాత్రి సమయంలో రహదారి దాటుతున్న క్రమంలో భారీ వాహనం ఢీకొనడంతో పులులు మృతి ఉండొచ్చని భావిస్తున్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande