నగరంలో కంటైనర్ ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్ లోని దబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం కంటైనర్ ప్రమాదం జరగటంతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. బంజారాహిల్స్లో కార్లను డెలివరీ చేసే నిమిత్తం నెల్లూరు నుండి హైదరా
కంటైనర్ ప్రమాదం.


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్ లోని దబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం కంటైనర్ ప్రమాదం జరగటంతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. బంజారాహిల్స్లో కార్లను డెలివరీ చేసే నిమిత్తం నెల్లూరు నుండి హైదరాబాద్కు వచ్చిన ఒక కంటైనర్, అక్కడ ఉన్న గ్యాంట్రీ హైట్ బ్యారియర్ను బలంగా ఢీకొట్టింది. కంటైనర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో అది హైట్ బ్యారియర్ వద్ద చిక్కుకుపోయింది. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande