
వరంగల్, 21 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గడ్లోని తన ఇంటివద్ద ఆదివారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుండి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్కు తరలించారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారెడ్డిపై UAPA చట్టం కింద కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా ఇన్నారెడ్డి మీడియాలో మావోయిస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలలో ఇటీవల మాట్లాడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు