సైబర్ నేరగాళ్ల నయా స్కెచ్.. అప్రమత్తంగా ఉండండి.. సీపీ సజ్జనార్
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) వాట్సాప్కు వచ్చే లింక్లను అస్సలు క్లిక్ చేయొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. వారు నేడు సోషల్ మీడియా ద్వారా.. మీ వాట్సాప్ లోని రహస్యాలను దోచేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడ వేస్తున్న
సజ్జనార్


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) వాట్సాప్కు వచ్చే లింక్లను అస్సలు క్లిక్ చేయొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరిస్తున్నారు. వారు నేడు సోషల్ మీడియా ద్వారా.. మీ వాట్సాప్ లోని రహస్యాలను

దోచేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడ వేస్తున్నారు. దీని కోసం మీ వాట్సాప్ను వారి గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వైరస్తో కూడిన ఘోస్ట్ పేయిరింగ్ లింక్ను రూపొందించారు. ఈ ఘోస్ట్ పెయిరింగ్ను లింక్ల ద్వారా పంపించి ఇక మీ వాట్సాప్ను వారి ఆధీనంలోకి తీసుకుని అందులో ఉండే చాటింగ్లు, వీడియోలు, ఫొటోలు ఇంకా అనేక మీ వ్యక్తిగత రహస్యాలను వారు తెలుసుకుంటారు. ఇక ఆ తర్వాత మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు మీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అందీరికి మీరు పంపినట్లుగా మెసేజ్లు, వీడియో కాల్స్లు చేసి ఇబ్బంది పెట్టడంతో పాటు డబ్బులు వసూలు చేస్తారు అంటూ అప్రమత్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande