
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం తన నివాసంలో కానిస్టేబుల్ చైతన్య ఈ దారుణానికి పాల్పడగా.. ప్రస్తుతం కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసుపత్రి వద్దకు చేరుకొని అతని పరిస్థితిపై వైద్యులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్థిక సమస్యల వల్లనే కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈరోజు ఉదయం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి చైతన్యను తాను కలిశానని, అతని పరిస్థితి విషమంగా ఉందని, బ్రతికే అవకాశం చాలా తక్కువగా ఉందని తెలిసిందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు