
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏఐసీసీ నేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై కిషన్ రెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు. అందులో ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ని అడిగి తెలుసుకున్నారా..? వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించారా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, తాజాగా విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లవి అందుకున్నారని, గతంలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా అంటూ సోనియా గాంధీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు