జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు...?! ప్రభుత్వం కసరత్తు..
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ సర్పంచులను దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే జోష్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి, ప్రభుత్వానికి పట్టు ఉందని చాటే
మున్సిపల్ ఎన్నికలు


హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.) పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ

సర్పంచులను దక్కించుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇదే జోష్లో మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. గ్రామీణ ప్రాంతాలే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీకి, ప్రభుత్వానికి పట్టు ఉందని చాటేందుకు ఇదే మంచి అవకాశమని భావిస్తోంది. అన్నీ కుదిరితే.. జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే పార్టీ పరంగా మున్సిపల్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande