
హైదరాబాద్, 21 డిసెంబర్ (హి.స.)
సిట్ అధికారులతో హైదరాబాద్లోని
కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సీపీ సజ్జనార్ సమావేశం అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసు లో పూర్తి ఛార్జిషీట్కు ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్న అందరినీ విచారించాలని చెప్పారు. రాజకీయ నేతలు, అధికారులు ఎవరినీ వదలొద్దని అన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ప్రభాకర్రావును సీపీ సజ్జనార్ స్వయంగా విచారించడానికి సిద్ధమయ్యారు. సోమవారం ఆయన సిట్ కార్యాలయానికి వెళ్లి విచారించనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ఏసీపీ, డీసీపీ, జాయింట్ సీపీ స్థాయి అధికారులు మాత్రమే విచారించారు. కమిషనర్ స్థాయిలో స్వయంగా విచారించటం ఇదే తొలిసారి కానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..