జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన షర్మిల
అమరావతి, 21 డిసెంబర్ (హి.స.) ఏపీ మాజీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. దీంతో ఆయనకు అభిమానులు, కార్యకర్తలతో పాటు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్
8e5932914ce2a172bed1e4a11faafb0d_1274453852.jpg


అమరావతి, 21 డిసెంబర్ (హి.స.)

ఏపీ మాజీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. దీంతో ఆయనకు అభిమానులు, కార్యకర్తలతో పాటు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ పోస్టులో షర్మిల... వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీరు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. అని పేర్కొన్నారు. షర్మిల పుట్టిన పోస్టుకు నెటిజన్లు వైసీపీ అభిమానులు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.

అన్నయ్య అని పిలవచ్చు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు జగన్ మీ పుట్టిన రోజుకు విష్ చేయకపోయినా మీరు చేస్తున్నారు గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్, షర్మిల మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంపకాల విషయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా అన్నకోసం ఎంతో కష్టపడినా ఆశించినమేర షర్మిలకు పదవులు దక్కకపోవడం వల్లనే అసంతృప్తి చెందార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. ఇక ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తిన అనంత‌రం ష‌ర్మిల జ‌గ‌న్ పై నేరుగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande