.రాయచోటి.గాలివీడు మార్గంలోని. యండపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల.దుర్మరణం
రాయచోటి, 22 డిసెంబర్ (హి.స.) , రాయచోటి గ్రామీణ, రాయచోటి- గాలివీడు మార్గంలోని యండపల్లి వద్ద ఆదివారం చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రాయచోటి మండలం మాధవరం వడ్డెపల్లెకు చెందిన రేపన వెంకటసాయికుమార్‌(24), రేపన లక్ష్మీప్రసాద్
.రాయచోటి.గాలివీడు మార్గంలోని. యండపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల.దుర్మరణం


రాయచోటి, 22 డిసెంబర్ (హి.స.)

, రాయచోటి గ్రామీణ, రాయచోటి- గాలివీడు మార్గంలోని యండపల్లి వద్ద ఆదివారం చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రాయచోటి మండలం మాధవరం వడ్డెపల్లెకు చెందిన రేపన వెంకటసాయికుమార్‌(24), రేపన లక్ష్మీప్రసాద్‌ అలియాస్‌ ప్రతాప్‌(18)లు ద్విచక్ర వాహనంపై రాయచోటి నుంచి వెళ్లుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. యండపల్లి సమీపంలోని ఏకో పార్కు వద్ద రోడ్డుపై కల్వర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అధికారులు అక్కడ ఎలాంటి సూచికలు అమర్చకపోవడంతో పల్సర్‌ వాహనంపై వస్తున్న యువకులు కల్వర్టును గుర్తించకపోవడంతో అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకటసాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన లక్ష్మీప్రసాద్‌ అలియాస్‌ ప్రతాప్‌ను స్థానికులు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యలోనే లక్ష్మీప్రసాద్‌ మరణించారు. విషయం తెలుసుకున్న వారి మరణ వార్త తెలియగానే ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande