పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
పశ్చిమగోదావరి జిల్లా, 23 డిసెంబర్ (హి.స.) పెనుమంట్ర విషాదం చోటుచేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరులో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మద్యం మత్తులో బైక్‌పై వస్తూ అదుపు తప్పి గోడను ఢీకొట్టారు. తీవ్రగాయాల పాలైన వారిని 108
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం


పశ్చిమగోదావరి జిల్లా, 23 డిసెంబర్ (హి.స.)

పెనుమంట్ర విషాదం చోటుచేసుకుంది. పెనుమంట్ర మండలం పోలమూరులో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మద్యం మత్తులో బైక్‌పై వస్తూ అదుపు తప్పి గోడను ఢీకొట్టారు. తీవ్రగాయాల పాలైన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. మృతులను ఏలేటి రాజు (21), ఏలేటి అంజి (18), కోళ్ల సత్యనారాయణ (20)గా గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande