
కడప, 23 డిసెంబర్ (హి.స.)
: కడప నగరం నడిబొడ్డున ఉన్న పోలీసు శాఖ స్థలమది. విలువైన జాగా కాస్తా చేతులు మారింది. కడప కార్పొరేషన్‌లో ద్వితీయ శ్రేణి వైకాపా ప్రజాప్రతినిధి అందులో నిర్మాణాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. తెదేపా కీలక నేతలు కూడా స్పందించారు. అందులో చేపట్టిన నిర్మాణాలు ఆపేయించారు. వాణిజ్య దుకాణాలు తెరవకుండా అడ్డుకోగలిగారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎత్తులేశారు. దుకాణాలు తిరిగి తెరిచారు. ఇతరత్రా కార్యకలాపాలు సాగించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ