భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, 23 డిసెంబర్ (హి.స.) భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న భూభార
నిజామాబాద్ కలెక్టర్


నిజామాబాద్, 23 డిసెంబర్ (హి.స.)

భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై తహశీల్దార్, ఆర్.ఐ, ఇతర అధికారులతో సమీక్షించారు. దరఖాస్తులను పరిష్కరించే విషయమై నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని నివృత్తి చేస్తూ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ సూచనలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande