
మహబూబాబాద్, 23 డిసెంబర్ (హి.స.) మహబూబాబాద్ పట్టణం, రజాల్ పేటలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. స్టోర్ గది, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. తాజా కూరగాయలు, నిత్యవసర వస్తువులు నాణ్యత పక్కాగా పాటించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలన్నారు.
శీతకాల నేపథ్యంలో పిల్లలకు డైట్ మెనూ ప్రకారం.. వేడివేడి ఆహారాన్ని అందించాలని, రాత్రివేళలో పిల్లలకు చలి తీవ్రతను తట్టుకునే విధంగా ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించాలని, వేడి నీరు అందించాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు