
విశాఖపట్నం, 22 డిసెంబర్ (హి.స.)
, :వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈరోజు (సోమవారం) చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీలో జాయినింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆ పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఇందు కోసం వీఎంఆర్డీఏ అధికారులు కళ్లు మూసుకుని మరీ వైసీపీకి అనుమతి ఇచ్చారు. ఎరీనాలో వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు వారి నుంచి వీఎంఆర్డీఏ రూ.71,300 ఫీజు కూడా కట్టించుకుంది. అయితే చిల్డ్రన్స్ ఎరినాలో పార్టీ కార్యక్రమం నిర్వహించడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వీఎంఆర్డీ అధికారులు నాలుక కరుచుకున్న పరిస్థితి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ