
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం
కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఇవాళ (సోమవారం) బీజేపీ స్టేట్ ఆఫీస్లోలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ మొత్తం దోచుకున్నారని ఆయన ఆరోపించారు. పాలమూరుకు అన్యాయం చేసింది కేసీఆరే అని విమర్శించారు. పాలమూరు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను ఎంపీగా గెలిపించారని, ఐదేళ్లు పాలమూరు ఎంపీగా ఉండి.. పార్లమెంట్లో ఒక్కరోజైన మాట్లడారా? అని ప్రశ్నించారు. చివరికి మీకు ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. కాళేశ్వరం కమీషన్ల కోసం పాకులాడారు.. తప్పితే పాలమూరును పట్టించుకోలేదని, ఎత్తిపోతల పథకం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..