విపత్తు సమయంలో 'అప్రమత్తతే' శ్రీరామరక్ష : భద్రాద్రి కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, 22 డిసెంబర్ (హి.స.) విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపాడు
భద్రాద్రి కలెక్టర్


భద్రాద్రి కొత్తగూడెం, 22 డిసెంబర్ (హి.స.)

విపత్తులు సంభవించినప్పుడు ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. సోమవారం బూర్గంపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణపై భారీ 'మాక్ డ్రిల్' మరియు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్సీసీ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? బాధితులకు ఎలాంటి సాయం అందిస్తారు? అని అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande