శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) ఇటీవల కాలంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ విమానంలో బాంబుు పెట్టామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో అప్రమత్తం అయిన అధికారుల ఆదేశాలతో విమానాన్ని వె
బాంబు బెదిరింపులు


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

ఇటీవల కాలంలో హైదరాబాద్లోని

శంషాబాద్ విమానాశ్రయానికి వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా నెదర్లాండ్స్ విమానంలో బాంబుు పెట్టామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో అప్రమత్తం అయిన అధికారుల ఆదేశాలతో విమానాన్ని వెంటనే పైలట్ ఎయిర్ పోర్టులోనే ల్యాండ్ చేశాడు. హుటాహుటిన విమానంలోని ప్రయాణికులను కిందకి దించేసిన అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా.. గత కొంత కాలంగా ఇలాంటి ఫేక్ మెయిల్స్, బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికి అధికారులు రిస్క్ తీసుకోకుండా తనిఖీలు చేస్తూనే ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande