దారి తప్పి బంగ్లాదేశ్ లోకి వెళ్లిన బిఎస్ఎఫ్ కానిస్టేబుల్.. సురక్షితం
వెస్ట్ బెంగాల్, 22 డిసెంబర్ (హి.స.) పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద పశువుల స్మగ్లర్లను వెంబడిస్తూ తప్పిపోయిన బిఎస్ఎఫ్ జవాన్ సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. బిఎస్ఎఫ్ 174వ బెటాలియన్కు చెందిన కానిస్టేబ
బిఎస్ఎఫ్ కానిస్టేబుల్


వెస్ట్ బెంగాల్, 22 డిసెంబర్ (హి.స.) పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్

జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద పశువుల స్మగ్లర్లను వెంబడిస్తూ తప్పిపోయిన బిఎస్ఎఫ్ జవాన్ సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. బిఎస్ఎఫ్ 174వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ వేద్ ప్రకాష్, ఆదివారం తెల్లవారుజామున స్మగ్లింగ్ ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దు దాటి బంగ్లాదేశ్ భూభాగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో సరిహద్దు ప్రాంతంలో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో కనుచూపు మేర ఏమీ కనిపించకపోవడమే ఈ పొరపాటుకు ప్రధాన కారణమని అధికారులు వెల్లడించారు.

కానిస్టేబుల్ బంగ్లాదేశ్ భూభాగంలోకి రాగానే అక్కడి సరిహద్దు బలగాలు (BGB) ఆయనను అదుపులోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన బిఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెంటనే బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం తీన్ బిఘా కారిడార్ వద్ద ఇరు దేశాల భద్రతా బలగాల మధ్య జరిగిన 'ఫ్లాగ్ మీటింగ్' తర్వాత కానిస్టేబుల్ను బిజిబి అధికారులు క్షేమంగా బిఎస్ఎఫ్కు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande