మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో కొత్త పథకం!
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళా సంఘాల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను మహిళలకు కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మండలానికి ఒకటి చొప్పు
మహిళలకు గుడ్ న్యూస్


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు

మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళా సంఘాల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద విజయ డెయిరీ పార్లర్లను మహిళలకు కేటాయించేందుకు సిద్ధమైంది. ఈ పథకం ద్వారా మండలానికి ఒకటి చొప్పున, మున్సిపాలిటీల్లో రెండు చొప్పున మహిళా సంఘాలకు విజయ డెయిరీ పార్లర్లు కేటాయించేలా అధికారులు ప్రణాళిక రచిస్తునట్టు సమాచారం. దీనిపై వారం పది రోజుల్లో విధివిధానాలను ఖరారు చేయనున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande