
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)
చొక్కాలు మార్చినంత ఈజీగా రేవంత్ రెడ్డి పార్టీలు మార్చాడని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే నిన్న కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ప్రజలకు వాస్తవాలు చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక ఆరాచకత్వం జరిగిందని రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాక్షాత్తు ఇటీవల రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా కొత్త రాష్ట్రమైన తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు ప్రశంసించడం నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన గురించి రేవంత్ రెడ్డి పిలిచిన అతిథులే పొగడటం రుచించలేదా అని ఎద్దేవా చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..