రాష్ట్రంలో చలిగాలులు తీవ్రం.. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు
తెలంగాణ, 22 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో సి
చలి


తెలంగాణ, 22 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఆదిలాబాద్, పటాన్చెరులో 7.2 డిగ్రీలు, మెదక్లో 7.8 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 9 డిగ్రీలు, హనుమకొండలో 10.5 డిగ్రీలు, నిజామాబాద్లో 11.7 డిగ్రీలు, రామగుండంలో 11.9 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక సంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు పడిపోయినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అదేవిధంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి ప్రాంతాల్లో చలిగాలులు మరింత తీవ్రంగా ఉంటాయని IMD అంచనా వేసింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande